Kavitha#10

సాధారణ సుమాలను "ప్రకాశం"తో వికసింపజేసి 
విద్యా కుసుమాల మాల చేసిన ఓ వనమాలీ...
         విద్యార్ధులకు బంగరు భవిత చేకూర్చేందుకు 
         నిత్య ప్రణాళికలతో ముందుండి నడిపిన ఓ తాపసీ...
విద్యకు మీరు చేసిన సేవలు అమూల్యం 
విద్యార్ధుల యెడల మీకున్న ప్రేమ అపారం
         మా జీవన నైపున్యాలను తీర్చిదిద్దిన తీరు అమోఘం.
         మీ కృషికి "ప్రకాశం" పలుకుతోంది నీరాజనం...
చైత్రమాస కోయిలమ్మ ముందుగా కూసే వేళ...
ప్రకృతి పసిపాపలా పాల నవ్వులు చిందేవేళ...
సూర్య తాపం హిమ పర్వత హాయిని తలపించే వేళ...
జరుపుకుంటాం మీ జన్మ వేడుక నూరేల్లిలా...