మధురమైన నాలుగేళ్ల బంధమా
చిరకాలం మాతోనే ఉండుమా
చిక్కటి చెలిమి పంచిన ఆత్మీయమా
చక్కగా నూరేళ్ళు వర్దిల్లుమా
చెరగని చిరు జ్ఞాపకాల మణిహారమా
కాలం యెదలో కలకాలం దాగి ఉండుమా
ఇపుడిపుడే పెమ్పొందుతున్న స్నేహమా
కాల నాగు కాటుతో కలయై పోకుమా
చిరునగవుల వెలిగించిన దీపమా
దేదీప్యమై ఎప్పటికి వికసించుమా
స్నేహ ఛాయలు విస్తరించిన ఓ వృక్షమా
చల్లటి ఈ నీడలో జీవితకాలం మము కాచుమా