Kavitha#9

పసుప్పచ్చని చీరలో
ఎరుపెక్కిన బుగ్గలతో
సిగ్గుతో నిండిన చెక్కిళ్లతో
గులాబీ రంగు పెదాలతో
తొలి తొలకరి జల్లులో
మొత్తంగా తడిసిన మేనితో
బ్రహ్మ మలసిన బొమ్మలా
తన సహజ సౌందర్యంతో
చెలి విసిరిన చూపు వల
ఉప్పొంగిన సంద్రంలా
ఊగెను నా మనసు ఇలా
అయ్యెను తన బానిసలా
ఆపై నేను ఒక కల...