కవిత-01
మధురమైన నాలుగేళ్ల బంధమా
చిరకాలం మాతోనే ఉండుమా
చిక్కటి చెలిమి పంచిన ఆత్మీయమా
చక్కగా నూరేళ్ళు వర్దిల్లుమా
చెరగని చిరు జ్ఞాపకాల మణిహారమా
కాలం యెదలో కలకాలం దాగి ఉండుమా
ఇపుడిపుడే పెంపొందుతున్న స్నేహమా
ఇపుడిపుడే పెంపొందుతున్న స్నేహమా
కాల నాగు కాటుతో కలయై పోకుమా
చిరునగవుల వెలిగించిన దీపమా
దేదీప్యమై ఎప్పటికి వికసించుమా
స్నేహ ఛాయలు విస్తరించిన ఓ వృక్షమా
చల్లటి ఈ నీడలో జీవితకాలం మము కాచుమా
కవిత-02
ఓనా మరదలా
నీ ఎడబాటుతో తప్పెను నా కళ
అందుకే రా ఒకసారిలా
నీతో చెప్పవలెను చాలా
మన మధ్య ఎందుకీ గోల
(మన)కలయిక కాకూడదు కల
మన ప్రేమ ఆ బ్రహ్మ లీల
దానిని ఆపడమెలా?
ఓ చిలిపి కనుల బాల
నీ జత లేకపోతే ఎలా?
కవిత-03
ఊహ కందని కలలా కనిపించిన జాణా
మనసు నిలకడ తప్పెను నీ వలన
కొత్త ఊసులు మెదిలెను మది లోన
కనుక చెలి చెలిమి కోరుకుంటున్నా
నీతో స్నేహంతో బందీ అయి ఉన్నా
సంకెళ్ళు తెంచే అదే స్నేహం నీదంటున్న
కలిసి పలుకరించే అవకాశం లేకున్నా
అలాంటి తరుణం కోసం వీక్షణ ఆగునా
కళ్ళముందు కనబడు సమయం క్షేణిస్తున్నా
పంచుకున్న జ్ఞాపకాల హాయి చాలనుకున్నా
ప్రియ నేస్తం వీడనుందన్న వాస్తవం వేధిస్తున్నా
ప్రేమ పూరిత హస్తాల తపన ఫలించేనా....
కవిత-04
ప్రియా!నిన్ను చూసి ఉప్పొంగె నా మది
ప్రేమంటే ఇదేనని తెలిపినదది
తదుపరి నీ ఫోటోలతో మారింది నా గది
నా మనసొక నిశ్చల ప్రేమాంబుధి
నువ్వొక ఉరకలేసే సోయగాల నది
మన కలయిక ఇక సుప్రసిద్ధి
తీసుకో ఎంతైనా వ్యవధి
అందాకా వేచిఉంటుంది నా మది
నువ్వొప్పుకుంటే అవుతుంది మన షాదీ
ఆపై లైఫంతా ఓ సుమధుర సప్తపది
కవిత-05
నిన్నటి కలలోని సుందర వనంలో
కనిపించెను ఒక సౌందర్యవతి
నాపైకి ఎక్కుపెట్టిన ధనస్సులా వున్నదా యువతి
తను సంధించిన చూపులతో తప్పెను నా మతి
అప్పుడు పలికిన ఒక ఆకాశవాణి
తెలిపెను తనే నాకు కాబోయే సతి అని
తదుపరి ఆ క్షణాన
నేను లేను ఈ లోకాన
మునిగినాను కొత్త మైకాన
చెలి రాక కోసం వేచియున్నా
తన పిలుపు కోసం ఆగివున్నా
ఇలాగే ఉండిపోవాలనుంది
ఎంత కాలమైనా...
కవిత-06
రూపులోన స్వర్ణ మంజరి
అవును కదా తను రతి కుమారి
మాటలలో మధుర భాషిణి
మౌనాల వేళలో మణి
వలచి తలచా తదుపరి
గుళ్ళో పూజారిలా మారి
ఎప్పుడు తను పలుకరిస్తుందో మరి
యిప్పటికీ తెలియట్లేదుర సూరి
కవిత-07
చెలియా నీ ఎడబాటు చేస్తుంది నాకు తియ్యటి ఎదగాయం
నువ్వు లేకపోతే నా జీవితం ఇక పై కాగలదు ఒక సందేహం
కనీసం నీ పలుకు ఒక్కటైనా
అది కాగలదు నా ఎద ఎడారికి ఒయాసిస్
కనుక నా చెలి
తెలియక చేసిన తప్పుల్ని "నా మనసు" తో క్షమించి
నీ మనసు క్షమాగుణాన్ని ప్రదర్శించి
నాకు జతగా నిన్ను కోరే
ఈ దాసుణ్ణి మన్నించు.
ప్రేమతో ఎదను గాయపరచిన నీవే దాన్ని మాన్పించు.
నా మనసు నిన్నలా
నా అధినంలో లేదు
అది నా దేహాన్ని అలా ఉంచట్లేదు
చెవులు నీ చిలిపి పలుకులకై ఆరాతపడ్తున్నాయ్
పెదవులు నీతో మాట్లాడుటకు ఉర్రూతలూగేస్తున్నాయ్
నిన్ను చుమ్భించేలా చేయమని దేవుని ప్రార్ధిస్తున్నాయ్
చేతులు నిన్ను ఎప్పుడు అల్లుకోవాలా అని తహతహ లాడగా
పాదాలు నీ కడకు చేరేందుకు సన్నద్ధమవగా
ఆగలేక నా మనసు నీ వెంటే వుండగా
నిరాదరనగా ఇంకా సజీవంగా
నీ ప్రియుడనని గర్వంగా జీవిస్తూ ఇలా...
కవిత-08
పసుప్పచ్చని చీరలో
ఎరుపెక్కిన బుగ్గలతో
సిగ్గుతో నిండిన చెక్కిళ్లతో
గులాబీ రంగు పెదాలతో
తొలి తొలకరి జల్లులో
మొత్తంగా తడిసిన మేనితో
బ్రహ్మ మలసిన బొమ్మలా
తన సహజ సౌందర్యంతో
చెలి విసిరిన చూపు వల
ఉప్పొంగిన సంద్రంలా
ఊగెను నా మనసు ఇలా
అయ్యెను తన బానిసలా
ఆపై నేను ఒక కల...
కవిత-09
స్వచ్చమైన స్నేహానికి ప్రతి రూపమా
మచ్చలేని పసి తనమా
ఆదర్శనీయ వ్యక్తిత్వమా
అంతులేని ఆత్మీయమా
చెదిరిపోని చిరు నగమా
అచెంచల చెలిమికి చిరునామా
నువ్వు దొరకడం మా అదృష్టం మామ
జన్మ కానుకగా ఇది నేనిచ్చే
స్నేహ పరిమళ కవిత కుసుమ...
కవిత-10
పువ్వు ఏదో చెప్పబోతే పేద చెవిని పెట్టా
గాలి గుసగుసలు మామూలే అనుకున్నా
ప్రకృతి మధుర భావాన్ని కనిపెట్టలేకపోయా
మీ ముఖం లోని కొత్తదనాన్ని పసిగట్టలేకపోయా
నా మిత్రులు ప్రకృతి భావాన్ని తెలిపాక
ఆనందంతో తన్మయం చెందా
మది మధురానుభూతిని పేపర్ పై పెట్టాలనుకున్నా
ఆ భావానికి రూపమే ఇది...
HAPPY BIRTHDAY TO RAMI REDDY sir
ప్రియమైన గాంభీర్యమా
క్రమశిక్షన ప్రతిరూపమా
వెలకట్టలేని స్నేహబంధమా
మేము మెచ్చే గురుపూజ్యమా
MANY MORE HAPPY RETURNS OF THE DAY
కవిత-11
సాధారణ సుమాలను "ప్రకాశం"తో వికసింపజేసి
విద్యా కుసుమాల మాల చేసిన ఓ వనమాలీ..
విద్యార్ధులకు బంగరు భవిత చేకూర్చేందుకు
నిత్య ప్రణాళికలతో ముందుండి నడిపిన ఓ తాపసీ..
విద్యకు మీరు చేసిన సేవలు అమూల్యం
విద్యార్ధుల యెడల మీకున్న ప్రేమ అపారం
మా జీవన నైపున్యాలను తీర్చిదిద్దిన తీరు అమోఘం.
మీ కృషికి "ప్రకాశం" పలుకుతోంది నీరాజనం..
చైత్రమాస కోయిలమ్మ ముందుగా కూసే వేళ..
ప్రకృతి పసిపాపలా పాల నవ్వులు చిందేవేళ...
విద్యార్ధుల యెడల మీకున్న ప్రేమ అపారం
మా జీవన నైపున్యాలను తీర్చిదిద్దిన తీరు అమోఘం.
మీ కృషికి "ప్రకాశం" పలుకుతోంది నీరాజనం..
చైత్రమాస కోయిలమ్మ ముందుగా కూసే వేళ..
ప్రకృతి పసిపాపలా పాల నవ్వులు చిందేవేళ...
సూర్య తాపం హిమ పర్వత హాయిని తలపించే వేళ..
జరుపుకుంటాం మీ జన్మ వేడుక నూరేల్లిలా...
కవిత-12
పరిచయమే ఎరుగని ఒక మోము
పలుకుతో మైమరపు కమ్మింది ఏదో
కలలోనైనా కనిపించని ఓ భామిని
వరమిచ్చెను జీవితాంతం తోడుని
ఏనాడు ఊహకైనా రాని కోమలి
తొలిచూపులోనే దోచింది మనసుని...
నిన్నటి దాకా చెలియ ఊసే లేదు
చిత్తంలో నిండెను తనే ఈనాడు
మాట మాత్రమైనా చెప్పక అమ్మడు
మాయ చేసింది మొత్తంగా నేడు
చిలిపి ఆశలు రేపిన చిన్నది అనిత
శీఘ్రమే కానున్నది నాకు శ్రీమతి...
కవిత-13
సొగసరి నవ్వుల చిలక
విసిరెను చూపుల అల్లిక
గడసరి మాటల బాలిక
బంధించె నా మనసు చకచక
మనవి తెలిపే వీలులేక
మనసు భావాలు ఆపలేక
కవితయే నా పలుకుగా ఇక
తెలుపుతున్నా విను పెళ్ళామా
"నేనుండలేను నిను చూడక"
కవిత-14
మల్లె తీగ అడుగుతోంది మళ్ళీ ఎపుడొస్తారని
కోడి కూస్తూ అంటోంది ఊరెదురుచూస్తోందని
చెట్టు సైగలు చేస్తోంది త్వరగా రారమ్మని
ఇల్లు ఎదురు చూస్తోంది ఇంకా రాలేదేమని
మది తెలిపె ఆ ఘడియ సంక్రాంతై వస్తోందని...
నగరం ఊరెళ్ళి సేద తీరింది
పల్లె "సంక్రాంతి"తో పులకరిస్తోంది
మీకు మీ కుటుంబ సభ్యులకు ముందుగానే "సంక్రాంతి" శుభాకాంక్షలు.
కోడి కూస్తూ అంటోంది ఊరెదురుచూస్తోందని
చెట్టు సైగలు చేస్తోంది త్వరగా రారమ్మని
ఇల్లు ఎదురు చూస్తోంది ఇంకా రాలేదేమని
మది తెలిపె ఆ ఘడియ సంక్రాంతై వస్తోందని...
నగరం ఊరెళ్ళి సేద తీరింది
పల్లె "సంక్రాంతి"తో పులకరిస్తోంది
మీకు మీ కుటుంబ సభ్యులకు ముందుగానే "సంక్రాంతి" శుభాకాంక్షలు.
కవిత-15
లెక్క చేయక ఎండనూ వాననూ
లెక్కకు మించి వచ్చేరు ఎప్పుడూ తప్పక
కాలినడకన భక్తులు నీకడకు శ్రీ వేంకటేశ్వరా
అనుగ్రహించురా దేవా మమ్మెల్లరను
పరమదయాకరా శ్రీనివాసా
లెక్కకు మించి వచ్చేరు ఎప్పుడూ తప్పక
కాలినడకన భక్తులు నీకడకు శ్రీ వేంకటేశ్వరా
అనుగ్రహించురా దేవా మమ్మెల్లరను
పరమదయాకరా శ్రీనివాసా
కవిత-16
తలపులోని చెలియ బొమ్మ
బహు చక్కగా ఉన్నదమ్మా
తనని చేరే తరుణమేదో
విన్నవించవే జాబిలమ్మా...1
చెలి చూపు వలై లాగెనమ్మా
లోలోన నా మది మురిసెనమ్మా
సఖి ప్రేమ వర్షించే క్షణమేదో
తెలుపుమా ఓ చిలుకమ్మా...2
చిక్కటి నవ్వుల చక్కనమ్మ
కనుల పండుగై వచ్చెనమ్మా
కలల కోమలిని, నే వరింప
కలిసి రావే సుముహూర్తమా...3
విన్నవించవే జాబిలమ్మా...1
చెలి చూపు వలై లాగెనమ్మా
లోలోన నా మది మురిసెనమ్మా
సఖి ప్రేమ వర్షించే క్షణమేదో
తెలుపుమా ఓ చిలుకమ్మా...2
చిక్కటి నవ్వుల చక్కనమ్మ
కనుల పండుగై వచ్చెనమ్మా
కలల కోమలిని, నే వరింప
కలిసి రావే సుముహూర్తమా...3
కవిత-17
తరతరాల వారధి
కోటి కాంతుల పునాది
నేలపై విరబూసే పున్నమి
పిన్నల పెద్దల పెన్నిధి
దివ్య దివ్వెల దీపావళి
ఎంచి చూడగ ఇది
అరిషడ్వర్గాలనే
మనలోని అసురులని
దహించి సరికొత్త ప్రేరణతో
విజయ తీరాలకు చేర్చి
హాయి పంచగా వచ్చిన
పసందైన మన దీవాళి
కోటి కాంతుల పునాది
నేలపై విరబూసే పున్నమి
పిన్నల పెద్దల పెన్నిధి
దివ్య దివ్వెల దీపావళి
ఎంచి చూడగ ఇది
అరిషడ్వర్గాలనే
మనలోని అసురులని
దహించి సరికొత్త ప్రేరణతో
విజయ తీరాలకు చేర్చి
హాయి పంచగా వచ్చిన
పసందైన మన దీవాళి
To be continued...