Kavitha#5

చెలియా నీ ఎడబాటు చేస్తుంది నాకు తియ్యటి ఎదగాయం 
నువ్వు లేకపోతే నా జీవితం ఇక పై కాగలదు ఒక సందేహం 
కనీసం నీ పలుకు ఒక్కటైనా
అది కాగలదు నా ఎద ఎడారికి ఒయాసిస్
కనుక నా చెలి 
తెలియక చేసిన తప్పుల్ని "నా మనసు" తో క్షమిన్చి 
నీ మనసు క్షమాగుణాన్ని ప్రదర్శించి 
నాకు జతగా నిన్ను కోరే
ఈ దాసుణ్ణి మన్నించు.

ప్రేమతో ఎదను గాయపరచిన నీవే దాన్ని మాన్పించు.

నా మనసు నిన్నలా 
నా అధినంలో లేదు 
అది నా దేహాన్ని అలా ఉంచట్లేదు 
చెవులు నీ చిలిపి పలుకులకై ఆరాతపడ్తున్నాయ్
పెదవులు నీతో మాట్లాడుటకు ఉర్రూతలూగేస్తున్నాయ్ 
నిన్ను చుమ్భించేలా చేయమని దేవుని ప్రార్ధిస్తున్నాయ్
చేతులు నిన్ను ఎప్పుడు అల్లుకోవాలా అని తహతః లాడగా 
పాదాలు నీ కడకు చేరేందుకు సన్నద్ధమవగా
ఆగలేక నా మనసు నీ వెంటే వుండగా 
నిరాదరనగా ఇంకా సజీవంగా 
నీ ప్రియుడనని గర్వంగా జీవిస్తూ ఇలా...