ప్రియా!నిన్ను చూసి ఉప్పొంగె నా మది
ప్రేమంటే ఇదేనని తెలిపినదది
తదుపరి నీ ఫోటోలతో మారింది నా గది
నా మనసొక నిశ్చల ప్రేమాంబుధి
నువ్వొక ఉరకలేసే సోయగాల నది
మన కలయిక ఇక సుప్రసిద్ధి
తీసుకో ఎంతైనా వ్యవధి
అందాకా వేచిఉంటుంది నా మది
నువ్వోప్పుకుంటే అవుతుంది మన షాదీ
ఆపై లైఫంతా ఓ సుమధుర సప్తపది