దయ లేని కాలమా
కానరాని ప్రాణమా
ఎడబాటుతో వేధించకుమా ...
కనులలోని స్వప్నమా
ఎదుటనున్న నేస్తమా
వదిలివెళ్లకే సుకుమారమా ...
కోమలమైన రూపమా
నిండుగా కొలువై ఉండుమా
నా మది ప్రేమగా అనెనమ్మా ...
ఊహకందని లావణ్యమా
నా ఊహలలో ఓ ప్రేమా
కనుల చూపు నీవై కాచుమా ...